మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 19 అక్టోబరు 2019 (17:25 IST)

శభాష్ శృతి, తొలి ప్రయత్నంలోనే గ్రూప్ 1కి ఎంపికైన గాజువాక యువతి

అకుంటిత దీక్ష, పట్టుదల, గమ్యాన్ని చేరాలనే అకాంక్ష వుంటే  ఏద్తెనా సాధించవచ్చని నిరూపించింది గాజువాకకు చెందిన శృతి. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1కు డిఎస్‌పిగా ఎంపిక అయ్యింది.
 
గాజువాక, వడ్లపూడికి చెందిన యర్రగుంట శృతి చిన్నతనం నుంచి చదువుప్తె శ్రధ్ధ ఎక్కువగా వుండటంతో తల్లిదండ్రులు సుధాకర్ కుమార్, సత్యవతిలు శృతికి ప్రత్యేకంగా శ్రద్ద కనబరిచారు. 
 
చిన్న వయస్సులోనే పదవ తరగతి పూర్తి చేసిన శృతికి ఉన్నత చదువులకు వయసు చాలలేదు. దీంతో ఈ విషయం అధికారులకు చెప్పడంతో వెంటనే విధ్యాశాఖ అధికారులకు అదేశాలిచ్చి శృతికి పైచదువులకు అనుమతినివ్వడంతో ఎంఫార్మసీ వరకు చదివింది. అనంతరం సివిల్స్‌కు చదువుతున్న క్రమంలో ఇంటిలిజెన్స్ బ్యూరోలో అధికారిగా కర్ణాటకలో పోస్టింగ్ వచ్చిందని శృతి తెలిపింది.
 
తరువాత 2018 గ్రూపు l వ్రాత పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ పాసవ్వడంతో సివిల్ డిఎస్‌పిగా ఎంపికైనట్లు తెలిపారు. ట్త్రెనింగ్ పూర్తయి పాసింగ్ పేరేడ్ కూడా పూర్తయ్యిందన్నారు. 22వ తేదీన గ్రెహాండ్స్ డిఎస్‌పిగా డిజీపి ఆదేశాలివ్వనున్నట్లు శృతి తెలిపారు.
 
పోలీసు అధికారిగా విధులు నిర్వహించి ఫ్రెండ్లి పోలీసింగ్ వాతావరణం కల్పిస్తానని అన్నారు. స్టేషన్‌కి వచ్చే వారికి న్యాయం జరిగేలా చూస్తానన్నారు. సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యమని శృతి తెలిపారు.