శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (20:51 IST)

భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా... వల్లభనేని క్షమాపణలు

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణికి ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ క్షమాపణ చెప్పారుగ‌త కొన్ని రోజులుగా వివాద‌స్పదంగా మారిన అంశంపై టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ క్షమాపణ చెప్పారు. 
 
తాను భువనేశ్వరిపై పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశానని.. చంద్రబాబు సతీమణికి క్షమాపణలు చెప్తున్నానన్నారు. భావోద్వేగానికి గురై ఒక పదం తప్పుగా దొర్లినమాట వాస్తవం. తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు.
 
"టీడీపీలో అందరికంటే ఆత్మీయురాలు భువనేశ్వరి. భువనేశ్వరిని నేను అక్కా అని పిలుస్తా. కులం నుంచి వెలివేస్తారనే భయంతో క్షమాపణ చెప్పలేదు.. నేను మనస్ఫూర్తిగానే క్షమాపణ చెబుతున్నా" అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్ర‌క‌టించారు.