బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 2 నవంబరు 2021 (10:49 IST)

వరికోత యంత్రాన్ని ప్రారంభించిన గన్నవరం ఎమ్మెల్యే డా.వల్లభనేని వంశీ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు అండగా వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా గ‌న్న‌వ‌రం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలంలోని తుట్టగుంట గ్రామానికి చెందిన గుడిసే బాలస్వామి,డొక్కు సాంబశివరావు, దాసరి సీతమ్మల‌కు రూ.30,95,000/- విలువ చేసే వరికోత యంత్రాలకు రూ.8,88,000/- ప్రభుత్వ రాయితీ ద్వారా అందచేశారు.

 
రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నార‌ని ఎమ్మెల్యే వంశీ చెప్పారు. వ్యవసాయనికి కావాల్సిన అన్ని రకాల పరికరాలు సబ్సిడీపై అందచేయడమే కాకుండా రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు అండగా ​ఉండే ప్రభుత్వం వైసీపీ ప్ర‌బుత్వం అని శాసనసభ్యులు తెలిపారు.
 
 
నియోజకవర్గంలో రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ, లోతట్టు ప్రాంతాలకు సొంత నిధులతో మోటార్లు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ అని రైతు నాయ‌కులు కొనియాడారు. రైతు క్షేమమే తన సంతోషంగా భావించే శాసనసభ్యులు ఉండటం గ‌న్న‌వ‌రం నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి అండగా నియోజకవర్గంలో ప్రతి రైతు శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు డా.వల్లభనేని వంశీ అని నియోజకవర్గ వైస్సార్సీపీ నాయకులు తెలిపారు.