మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 ఫిబ్రవరి 2025 (12:46 IST)

తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం- రాజమండ్రిలో రెండు కేసులు (video)

guillain-barr-syndrome
గుంటూరులో ఇటీవలే మరో మూడు గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) కేసులు వెలుగు చూశాయి.  బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గడిచిన మూడు రోజుల్లో కొత్తగా ఈ మూడు కేసులు నమోదైనట్లు ఆసుపత్రి అధికార వర్గాలు తెలిపాయి. జీబీఎస్‌ బాధితుల్లో గర్భిణి కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. 
 
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీబీఎస్ కలకలం రేపింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు కేసులు నమోదైనాయి. ఈ వైరస్ సోకిన వారిని వైద్య పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 
 
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను సూచిస్తున్నారు.