సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 జులై 2022 (10:41 IST)

రెడ్ అలెర్ట్.. మళ్ళీ పెరిగిన గోదావరి..

godavari river
గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. గత 24 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మళ్లీ గోదావరి పెరుగుతోంది. 
 
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 45 అడుగుల వరకు చేరుకుంది. శుక్రవారం ఉదయం 42 అడుగులు వున్న గోదావరి శనివారం తెల్లవారుజామున 45 అడుగులకు చేరుకుంది. 
 
గోదావరి ప్రమాదకరంగా మారడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వల్ల మూడవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 
 
ఇప్పటికే ఉగ్ర గోదావరి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో లక్షలాది మందిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పదుల సంఖ్యల్లోని గ్రామాలు నీట మునిగాయి. 
 
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను నెలకొల్పింది. వరద బాధితులకు ఆర్థిక సాయంతోపాటు రేషన్‌ అందివ్వాలని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన సీఎం జగన్‌ ఆదేశించారు.