ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 జులై 2021 (13:24 IST)

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామికి బంగారు పూలు

బ్రాడీపేట, గుంటూరు కు చెందిన ఎం.ఘనశ్యామాచార్యులు మరియు ఎం.రంగా దేవి శ్రీ అమ్మవారికి సుమారు రూ.2,50,000/- లు విలువ జేయు 52.1 గ్రాములు బరువు కలిగిన 108 బంగారు పూలను గౌరవ ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పైలా సోమినాయుడు గారు మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబని కలిసి దేవస్థానమునకు విరాళముగా అందజేసినారు.

ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము కార్యనిర్వహణాధికారి గారు మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ గారు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేసినారు.