మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Updated : శనివారం, 24 జులై 2021 (16:17 IST)

ఏపీలో కాంట్రాక్ట్ లెక్చ‌ర‌ర్లకు గుడ్ న్యూస్... కంటిన్యూ...!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇది గుడ్ న్యూస్...జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగింపును ప్ర‌క‌టించింది. అలాగే, ఒప్పంద ఉద్యోగులకు మేలు చేకూరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీల్లో పని చేస్తున్న 719 మంది కాంట్రాక్ట్ లెక్చరర్ల సేవలను మరో ఏడాది పాటు వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం.

దీంతో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ వారి సేవలను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 2021 నుంచి ఓ పది రోజుల పాటు వారి సేవలకు విరామం ఉంటుందని ఉన్నత విద్యాశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.