శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 15 జులై 2021 (20:15 IST)

అగ్ర వ‌ర్ణాల‌కు శుభవార్త, 10 శాతం రిజర్వేష‌న్

వివిధ వ‌ర్గాల‌కు తాయిలాలు అందిస్తున్న వైసిపి అధినేత జ‌గ‌న్ ... అగ్ర‌వ‌ర్ణాల‌కూ గాలం వేశారు. త‌న‌దైన శైలిలో జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అగ్రవర్ణపేదలకు రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో క‌ల్పించాల‌ని నిర్ణ‌యించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను మరింత సరళతరం చేసిన వైయస్‌.జగన్‌ సర్కార్ ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కుటుంబ వార్షికాదాయం 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితిని ప్ర‌భుత్వం రూ.6 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచింది. గ‌తంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ మెమో జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని తహశీల్దార్‌ కార్యాలయాలకు అధికారిక సమాచారం అందింది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్దేశించారు.