కొమరంభీం సరికొత్త అవతారం రేపే విడుదల
ఎన్.టి.ఆర్. అభిమానులు తమ కథానాయకుడు కొత్త గెటప్, కొత్త న్యూస్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు ఎన్.టి.ఆర్. పుట్టినరోజు ఈనెల 20. అంటే రేపు గురువారం. రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్. (రౌద్రం, రుధిరం, రణం) చేస్తున్నాడు. రామ్‌చరన్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్. కొమరంభీం పాత్రను పోషిస్తున్నాడు.
ఈలోగా ఎన్.టి.ఆర్. కరోనా పాజిటివ్ సోకింది. ప్రస్తుతం ఇంటిలోనే ఉంటున్నారు. ఈరోజే తాను కోవిడ్‌ను జయిస్తాను. పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దు అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇదిలా వుండగా, ఈరోజు సాయంత్రానికి రాజమౌళి కార్యాలయం నుంచి ఎన్.టి.ఆర్. అభిమానులకు శుభవార్త వచ్చింది. కొమరం భీమ్ గురించి ఊహించని ఆసక్తికరమై విషయం వస్తోంది అని తెలిపింది. రేపు 10గంటలకు అభిమానులు బీ రెడీ. అంటూ సేఫ్ లైఫ్, మాస్క్‌లు పెట్టుకోండి అంటూ హితవు పలికింది.