చంద్రబాబుపై ప్రభుత్వం ప్రతీకారం : మాణిక్యాల రావు
ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు.
మాజీ సీఎం చంద్రబాబునాయుడు విధానాలనే ముఖ్యమంత్రి జగన్ అవలంభిస్తున్నారని విమర్శించారు. నాడు టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్ పోర్టులోనే ప్రతపక్ష నేత జగన్ ని నిర్బంధించారని గుర్తుచేశారు.
టీడీపీ హయాంలో ప్రతిపక్ష నేత జగన్ పై, కేంద్ర ప్రభుత్వంపై, మోదీని అవహేళన చేసేలా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఈ రోజున అదే దారిలో జగన్ పయనిస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమౌతోందని అన్నారు.
నాడు చంద్రబాబు వ్యవహారశైలిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ అవన్నీమర్చిపోయి అదే పోకడ పోతున్నారని విమర్శించారు.