ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 10 మార్చి 2020 (21:10 IST)

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లుగా నమోదైన గవర్నర్ దంపతులు

గవర్నర్
రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్‌భవన్ విజయవాడ మధ్య నియోజకవర్గ పరిధిలో ఉండగా గవర్నర్‌తో పాటు మహిళా గవర్నర్ సుప్రవ హరిచందన్ సైతం ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.
 
గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్దార్ నాగమణి మంగళవారం గవర్నర్ దంపతులకు సంబంధించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసారు. అప్పటికప్పుడే వివరాలను సరిచూసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రధమ పౌరునికి అతి త్వరలోనే ఓటరు కార్డును అందచేస్తామని తెలిపారు.