శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (10:33 IST)

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఓటర్ల నానా తంటాలు

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లేందుకు ఓటర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇంకా కేరళలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా సోమవారం పోలింగ్ జరుగుతోంది.

మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడి సంగ్లి, నాసిక్‌, పుణె, రత్నగిరి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. 
 
అలాగే కేరళలో 9.7లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. తిరువనంతపురంలోని వట్టియూర్కావు, అళప్పుజలోని ఆరూర్‌, పత్నంతిట్టతో పాటు ఎర్నాకుళం, మాంజేశ్వరం స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఇందుకోసం 896 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఇందులో మాంజేశ్వరం మినహా నాలుగు స్థానాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.