మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్

ఏపీలో లాక్‌డౌన్‌తో మూతపడిన బార్లు.. మళ్లీ తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌ 4.0లో రెస్టారెంట్లను తెరుచుకునేందుకు కేంద్రం అనుమతించింది.

ఈ క్రమంలో రాష్ట్రంలో బార్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 840 బార్ల లైసెన్సులు కొనసాగిస్తున్నట్లు, 2021 జూన్‌ 30 వరకు వర్తిస్తుందని జీవోలలో ప్రభుత్వం స్పష్టంచేసింది.

ప్రస్తుత బార్‌ లైసెన్సీల కాలపరిమితి 2022 వరకు ఉన్నా ఈ ఏడాది జూన్‌ వరకే ఫీజులు చెల్లించారు. అప్పట్లో ఫీజులు చెల్లించాల్సి ఉన్నా కరోనా వల్ల 31 మంది మినహా ఎవరూ చెల్లించలేదు.

అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితి దృష్ట్యా అందరి లైసెన్సులు కొనసాగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నెల నుంచి లైసెన్సు ఫీజులు చెల్లించాలని స్పష్టంచేసింది.