శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (17:49 IST)

కొబ్బరి నామ‌ సంవత్సరంగా 2020-21: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి

అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన వెబినార్ లో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు.. ఈ సంద‌ర్భంగా వారు మాట్ల‌డుతూ  2020-2021 ఈ ఏడాదిని డా.వై.యస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయములో కొబ్బరి నామ‌ సంవత్సరంగా ప్రకటన చేయ‌డం కొబ్బ‌రి రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న బాధ్య‌త‌ను మ‌రింత‌గా పెంచింద‌న్నారు. 
 
కొబ్బరి  రైతుల‌కు ఆదాయం పెంచి ఇత‌ర రాష్ట్రాల‌తో పోటి ప‌డే విధంగా అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం మ‌రింత నాణ్య‌మైన ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పాల‌ని మంత్రి కన్నబాబు సూచించారు. రైతుల‌కు మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సూచన‌లు అందించా‌ల‌న్నారు. 
 
రైతు భ‌రోసా కేంద్రాల వ‌ద్ద ఉన్న వ్య‌వ‌సాయ స‌హ‌య‌కుల ద్వారా కొబ్బ‌రి రైతుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం త‌గ్గిన‌ ప‌రిష్కాల‌ను  చూపాల‌న్నారు. అంబాజీపేట కొబ్బరి పరిశోధన కేంద్రం 1953 నుంచి కొబ్బ‌రి ఉత్పత్తిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌డంపై మంత్రి కన్నబాబు హ‌ర్షం వ్య‌క్తం చేశారు.
 
కొబ్బరి రైతులకు మరింత మేలు చేసేలా శాస్త్రవేత్తలు పరిశోధన చేయాలన్నారు. కొబ్బరి ఉత్పత్తితో దేశములో నాల్గవ స్థానములోను, ఉత్పాదకతలో మొదటి స్థానములోను ఉన్నదన్నారు. 
 
1955లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయశాఖ పరిధిలో కొబ్బరిపై పరిశోధన చేపట్టడానికి, మొట్టమొదటి కొబ్బరి పరిశోధన కేంద్రాని అంబాజీపేటలో 60 ఎకరాల విస్తీర్ణములో ఏర్పాటు చేసింద‌న్నారు. అనంత‌రం  1966లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం యాజమాన్యం పరిధికి బదిలీ అయినదన్నారు.
 
ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా కొబ్బరిలో మేలైన రకాల ఉత్పత్తి మరియు యాజమాన్యం ద్వారా దిగుబడి, నాణ్యత పెంచుట మరియు కొబ్బరి రకాలకు సరియైన యాజమాన్య పద్ధతులను రూపొందించటం జ‌రుగుతుంద‌న్నారు. 
 
అదే విధంగా తెగుళ్లును అరికట్టుట రైతులకు ఆధునిక ఉద్యాన పరిజ్ఞానమును అందించుటం జ‌రుగుతుంద‌న్నారు. కొబ్బరి రకాలపై చేసిన పరిశోధనల ఫలితముగా గంగా బొండాం రకాన్ని జాతీయ స్థాయిలో 2007 లో 'గౌతమి గంగ' గా విడుదల చేయబడిందన్నారు. 
 
కొబ్బరి రైతులు కొబ్బరి తోటలందు అంతర పంటలు పండించుట ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని పరిశోధనల ద్వారా తేలినది. కొబ్బరిలో పురుగుల నివారణకు కొబ్బరి వేరు ద్వారా కీటక నాశక మందులను పెట్టు కొత్త పద్ధతి, రాష్ట్రములో తొలుతగా ఈ పరిశోధనా స్థానంలో కనుగొనబడింది. ఈ పద్ధతి రైతులో బాగా ప్రాచుర్యం పొందింది. కొబ్బరితోటలు పెంపకములో ఇది చౌక మరియు సమర్ధవంతమైన విధానం అన్నారు. 
 
మంత్రితో పాటు వెబినార్ లో పాల్గొన్న హార్టికల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి, వైయస్సార్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఉప కులపతి జానకిరామీరెడ్డి  మాట్లాడుతూ.. జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడ పీడలు - తెగుళ్ల నివారణ పై పరిశోధనతెల్లదోమ నివారణకు జీవనియంత్రక శిలీంధ్రాన్ని (ఇసారియా) మరియు మిత్రపురుగులు (ఎక్కార్సియా డైకో కైసా) మీద రైతులకు అవగాహన కల్పిస్తూ, మిత్రపురుగులను ఎక్కువ సంఖ్యలో రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. 
 
నూతనంగా కొబ్బరిని ఆశిస్తున్న పురుగులు మరియు తెగుళ్ళను సమర్ధవంతంగా జీవనియంత్రణ ద్వారా నివారించే ప్రయోగాలు జరుగుతుయి అని తెలిపారు.