బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 సెప్టెంబరు 2020 (07:35 IST)

ఈ దుస్థితి చూసిపోండి.. మోడీకి రాజధాని పిలుపు

వైసీపీ పాలన పుణ్యమాని రాజధాని దుస్థితి ఎలా తయారైందో చూసి వెళ్లాలని రాజధాని రైతులు ప్రధాని మోదీని ఆహ్వానించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ రైతులు చేపడుతున్న దీక్షలు గురువారం 275వ రోజుకు చేరుకున్నాయి.

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, కూలీలు మందడం, వెలగపూడి, యర్రబాలెం, కృష్ణాయపాలెం, అనంతవరం, పెదపరిమి గ్రామాల్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గుంటూరు, కృష్ణా వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్‌ ముందు డూడు బసవన్నలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధైర్యముంటే అమరావతి అజెండాగా రాజీనామా చేయండి అంటూ రాజధాని రైతులు సవాలు విసిరారు.