మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (11:37 IST)

కుమార్తెను ప్రేమించాడనీ అడ్డంగా నరికి చంపేశారు...

తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను ప్రేమించాడన్న అక్కసుతో ఓ యువకుడిని అడ్డంగా నరికి చంపేశారో కసాయి మనుషులు. ఈ దారుణం గుంటూరు జిల్లా పెదకాకాని మండల పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశలిస్తే, పెదకాకాని మండలం కొప్పురావూరునికి చెందిన  ఓ యువతిని అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఆగ్రహంతో వెంకటేశ్‌ని యువతి కుటుంబసభ్యులు దారుణంగా నరికి చంపారు. 
 
ఆరుగురితో కలిసి యువతి కుటుంబసభ్యులు యువకుడి కాళ్లూచేతులు నరికారు. స్థానికులు గమనించి రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడిని గుంటూరు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్‌ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.