శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (22:54 IST)

కోవిడ్ ఆసుపత్రిగా గుంటూరు జీజీహెచ్

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా.. గుంటూరు నగరంలోని జీజీహెచ్​ పాత బ్లాకును కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జీజీహెచ్​ కొత్త బ్లాకులో యథావిథిగా సాధారణ, అత్యవసర సేవలు కొనసాగిస్తూ... పాత బ్లాకును కోవిడ్ బాధితుల కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్... ఆసుపత్రి పరిశీలించారు.

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా... గుంటూరు జీజీహెచ్​లో 450 పడకలతో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి కొవిడ్-19 ఆసుపత్రిగా సేవలందిస్తుండగా..కేసులు పెరుగుతున్న కారణంగా.. జీజీహెచ్​లోని పాత బ్లాకును కోవిడ్ ఆసుపత్రిగా మార్చనున్నారు.

జీజీహెచ్ కొత్త బ్లాకులో సాధారణ, అత్యవసర వైద్య సేవలు కొనసాగనున్నాయని తెలిపారు. కొవిడ్-19 జిల్లా ప్రత్యేకాధికారి రాజశేఖర్, కలెక్టర్ శామ్యూల్ అనంద్ కుమార్ ఆసుపత్రిని పరిశీలించారు.

కొత్త, పాత బ్లాకుల మధ్య బారికేడ్లు, ఇతర ఏర్పాట్లపై.. జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడుకి ప్రత్యేక అధికారి, కలెక్టర్ సూచనలు చేశారు.