సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (15:20 IST)

హెయిర్ కంటింగ్ విషయంలో గొడవ : కత్తెరతో పొడిచి చంపిన వైనం

గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలో దారుణం జరిగింది. హెయిర్‌ కటింగ్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు కారణమైంది. కత్తెరతో ఓ వ్యక్తిని పొడిచి చంపేశాడు. శనివారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆంజనేయులు అనే వ్యక్తి హెయిర్‌ కటింగ్‌ కోసం స్థానిక కనకదుర్గమ్మ గుడికి సమీపంలో ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లాడు. అక్కడే ఉన్న చల్లా శ్రీనివాసరావు కటింగ్‌ సరిగా చేయించుకోరా అని ఆంజనేయులుకు చెప్పారు. 
 
దీంతో ఆంజనేయులు.. శ్రీనివాసరావును తిట్టి ఆపై చెంప మీద కొట్టాడు. దీన్ని చూసిన పక్కనే ఉన్న శ్రీనివాసరావు కుమారుడు నాగేంద్ర ‘‘మా నాన్ననే కొడతావా’’ అంటూ స్నేహితుడైన ఆంజనేయులతో గొడవపడ్డారు. 
 
ఈ ఘర్షణలో ఆంజనేయులు.. నాగేంద్రబాబు మెడపై ఎడమవైపు కత్తెరతో దాడి చేశాడు. ఘటనలో గాయపడిన నాగేంద్రబాబును పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్‌రావు తెలిపారు.