శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 14 సెప్టెంబరు 2017 (17:27 IST)

కోమటి రెడ్డి బ్రదర్స్‌పై గుత్తా ఫైర్: కేసీఆర్ ఐరెన్ లెగ్.. వాస్తు పిచ్చి పట్టుకుంది...

కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతూనే, టీఆర్ఎస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. నల్గొండలో మెడికల్ కళాశాల గురిం

కోమటిరెడ్డి బ్రదర్స్ ఓ వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిడుతూనే, టీఆర్ఎస్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. నల్గొండలో మెడికల్ కళాశాల గురించి మాట్లాడే నైతిక  హక్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదన్నారు.

జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ కేటాయించే యోచనలో కేసీఆర్ ఉన్నారని, ఎలాగూ వస్తుందని తెలుసుకున్నాకే వెంకటరెడ్డి దొంగ దీక్షలకు సిద్ధమవుతున్నారని గుత్తా విమర్శలు గుప్పించారు. కోమటిరెడ్డి సోదరులు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
 
కాగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఓ ఐరెన్ లెగ్ అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాకే శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యామ్‌లు ఎండిపోయాయని విమర్శించారు. టీఆర్ఎస్ పాలన వచ్చి మూడేళ్లు దాటినా తెలంగాణకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు. తన నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన అభివృద్ధినే తెలంగాణ అభివృద్ధిగా పేర్కొంటూ... జనాల చెవుల్లో కేసీఆర్ పువ్వులు పెడుతున్నారని మండిపడ్డారు.
 
టీఆర్ఎస్ పాలన రజాకార్ల పాలనను తలపిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌కు వాస్తు పిచ్చి పట్టుకుందన్నారు. అక్టోబర్ 2వ తేదీ లోపు నల్గొండకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని... లేకపోతే, తాను 72 గంటల నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని హెచ్చరించారు.