శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (08:42 IST)

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఢిల్లీలోనూ అవమానమే... ఇక నూకలు చెల్లినట్టే...

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది.

తెలంగాణా ప్రాంతానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతల కోమటిరెడ్డి బ్రదర్స్‌కు స్వరాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా అవమానమే ఎదురైంది. ఇటీవల హైదరాబాద్ శంషాబాద్‌లో వారికి తీవ్ర అవమానం జరిగింది. దీంత కోమటిరెడ్డి బ్రదర్స్ వెంటనే ఏదో నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. లేకపోతే రాజకీయంగా వారి ఉనికి ప్రశ్నార్థకంలో పడిపోయే ప్రమాదముందన్న వ్యాఖ్యానాలు కూడా వినిపించాయి. 
 
దీంతో అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు నేరుగా ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అప్పాయింట్‌మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా బ్రదర్స్ వైఖరిని బాగా అర్థం చేసుకున్న కాంగ్రెస్ హైకమాండ్ వారికి అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతోనే బ్రదర్స్ ఇక కాంగ్రెస్‌లో తమకు రోజులు చెల్లినట్లేనన్న భావనకు వచ్చినట్లు కాంగ్రెస్‌లో చెప్పుకుంటున్నారు.