సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (09:10 IST)

పదవికి రాజీనామా చేసిన సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి నేతల్లో అత్యంత కీలకమైన తన్నీర్ హరీష్ రావు తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించున్నారనే కథనాలు వినిపిస్తున్న సమయంలో హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయడం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
నిజానికి హరీష్ రావు తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు గౌరవాధ్యక్షుడుగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నేషనల్ మజ్దూర్ యూనియన్‌లోని తెలంగాణ కార్మికులంతా కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్‌ను స్థాపించారు. అప్పటి నుంచి దానికి ఆయన గౌరవాధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 
 
తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికులను ముందుండి నడిపించడంలో హరీశ్ రావు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన తన రాజీనామాను ప్రకటించడం కార్మికుల్లో చర్చనీయాంశమైంది. త్వరలో కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. దానికీ, హరీశ్ రాజీనామాకు ఏమైనా సంబంధం ఉందా? అన్న కోణంలో చర్చ జరుగుతోంది.