నిలకడగా జయేంద్ర సరస్వతి ఆరోగ్యం : డాక్టర్ రవిరాజ్
అస్వస్థతకు గురై విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం మెరుగుపడినట్టు ఆయనకు వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న డాక్టర్ రవిరాజ్ తెలిపారు.
అస్వస్థతకు గురై విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కంచిమఠం పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆరోగ్యం మెరుగుపడినట్టు ఆయనకు వైద్య చికిత్సలు నిర్వహిస్తున్న డాక్టర్ రవిరాజ్ తెలిపారు. ఈమేరకు బుధవారం జయేంద్ర సరస్వతి హెల్త్‌బులిటెన్ విడుదల చేశారు.
ఆయన ఆరోగ్యం మెరుగపడిందని, వెంటిలేటర్‌ను తొలగించామన్నారు. అలాగే ఫ్లూయిడ్స్‌ను నోటిద్వారానే అందిస్తున్నామని, మనుషుల్ని జయేంద్ర సరస్వతి గుర్తిస్తున్నారని తెలిపారు. ఈ రోజు కూడా ఐసీయూలోనే చికిత్స అందించి రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు డాక్టర్ రవిరాజ్ తెలిపారు.
కాగా, కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మంగళవారం ఉదయం తీవ్రమైన అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. దీంతో ఆయనను హుటాహుటిన సూర్యరావు పేటలోని ఆంధ్రా ఆసుపత్రిలో హర్ట్ అండ్ బ్రెయిన్ విభాగంలోని ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ముఖ్యంగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ వచ్చారు.