సోమవారం, 3 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (13:50 IST)

పేర్ని నానిపై కేసు : ఏ క్షణమైనా అరెస్టు... హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

perni nani
వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై నమోదైంది. గోదాము నుంచి రేషన్ బియ్యం మాయమైన వ్యవహారంలో ఆయనపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి, ఈ కేసులో ఆయనను ఆరో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య జయసుధ పేరు ఉంది. ఆమెకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఇదే కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఉన్న వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి మచిలీపట్నం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం వీరంతా మచిలీపట్నంలోని సబ్ జైలులో ఉన్నారు. తాజాగా పేర్ని నానిపై కూడా కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది.
 
ఈ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పేర్ని నాని  పిటిషన్‍ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నంపైన ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారించనుంది. తన గోదాము నుంచి రేషన్ బియ్యం బస్తాల మాయం కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండేలా రక్షణ కల్పించాలని ఆయన లంచ్ మోషన్ పిటిషన్‌‍లో దాఖలు చేశారు.