సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (18:33 IST)

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ - సుప్రీం తీర్పు ప్రస్తావన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు తాక్కాలికంగా వాయిదావేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 
 
ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. 
 
కాగా, ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. హడావుడిగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. పైగా, అఖిలపక్ష సమావేశం కూడా  నిర్వహించకుండా ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిందంటూ పలు రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి.