శనివారం, 1 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (19:41 IST)

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

summer
మండే సూర్యునిపై రాకాసి ప్లాస్మా తుపాన్లు విరుచుకుపడుతుంటాయి. వాటిని అత్యంత శక్తివంతమైన వేడి రాకాసి గాలులు అంతరిక్షంలోకి బయల్దేరుతాయి. అలాంటి గాలులతో భూమికి ముప్పు పొంచివుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
వాటి ప్రభావం యూరప్‌పై ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజులు వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి. ఈ గాలుల ప్రభావంతో ఎండలు దంచేస్తాయని.. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ ఎండ వేడిమి మామూలుగా వుండదని.. పిల్లలు, వృద్ధులు, పేషెంట్లు ఎండమీద బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తాగునీరు తగిన మోతాదులో తీసుకోవాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. 
 
ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఫిబ్రవరి 28 నుంచి వాతావరణం మారుతుంది. దీంతో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం వుంది. . శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడేలా ఉంది. ఈ అల్పపీడనం ప్రభావం వచ్చే వారం తెలుగు రాష్ట్రాలపై కనిపించే అవకాశాలున్నాయి.