శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జూన్ 2020 (17:17 IST)

అభయ ఆంజనేయ స్వామి దేవాలయం హుండీ చోరీ

బందరు మండలం చిన్న కరగ్రహారం గ్రామంలో అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. ప్రతి రోజూ దేవాలయంలో స్వామివారికి నిత్య కైంకర్య పూజాదికాలు జరుగుతూ ఉంటాయి.

ప్రతి సంవత్సరం వార్షిక ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కానీ ఈ సంవత్సరం కరోన వల్ల ఎటువంటి ఉత్సవాలు చేయలేదు అని తెలిపారు.

ఉత్సవాల అనంతరం హుండీ లెక్కిస్తామని కానీ ఈ సారి హుండీ లెకించలేదు. రాత్రి వచ్చిన భారీ వర్షానికి విద్యుత్ అంతరాయం వల్ల గ్రామస్తులు నిద్రపోతున్న సమయంలో గుడిలో దొంగలు పడి హుండీ కొల్లగొట్టారని తెలిపారు.

హుండీలో 15000 నుండి 20000 వరకు రూ నగదు ఉంటుంది అని అంచనా. ఉదయం దినచర్యలో భాగంగా గుడికి వచ్చి చూడగా తాళాలు పగలకొట్టి ఉండటం గమనించి పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని తెలిపారు.