గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (09:28 IST)

కాపురానికి రావడం లేదని భార్యపై బ్లేడుతో దాడి చేసి గొంతుకోసిన భర్త

తెలంగాణ రాష్ట్రంలో ఓ కసాయి భర్త అత్యంత క్రూరంగా నడుచుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని గొంతుకోశాడు. సంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస

తెలంగాణ రాష్ట్రంలో ఓ కసాయి భర్త అత్యంత క్రూరంగా నడుచుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదని గొంతుకోశాడు. సంగారెడ్డి జిల్లా బుద్వేల్ గ్రామంలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... బుద్వేల్‌ గ్రామానికి చెందిన రమేష్‌ కోహిర్‌కు చెందిన మమత ప్రేమించుకుని 2016 జనవరి 21న పెళ్లి చేసుకున్నారు.
 
అనంతరం మమత కుటుంబసభ్యులు గొడవపడి ఆమెను తీసుకెళ్లి నగరంలో కొత్తపేటలో మహిళా వసతి గృహంలో ఉంచి నర్సింగ్‌ కోర్సు చేయిస్తున్నారు. భార్య కొత్తపేటలోని ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న విషయం తెలుసుకున్న రమేష్‌ తరచూ వచ్చిపోతుంటాడు.
 
అదేక్రమంలో శనివారం సాయంత్రం వసతిగృహం వద్దకు చేరుకుని మాట్లాడుకుందామంటూ సమీపంలో ఉన్న విక్టోరియా హోం వద్దకు తీసుకెళ్లాడు. తనతో కాపురానికి రమ్మని కోరడంతో అందుకు ఆమె నిరాకరించింది. దీంతో కోపంతో ఊగిపోతూ ముందుగా పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో మమత గొంతుపైన, ఛాతిపైన దాడిచేయడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయింది.
 
ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు 108 ఆంబులెన్స్‌కు ఫోన్ చేయగా, ఆ సిబ్బంది వచ్చి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. సరూర్‌నగర్‌ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.