ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2016 (10:28 IST)

ఆడుకోనివ్వలేదని అమ్మమ్మపై పోలీసులకు మనవడి ఫిర్యాదు.. చాక్లెట్లు ఇవ్వడంతో?

పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుం

పిల్లలు స్కూలు నుంచి ఇంటి రాగానే చదువు చదువు అంటూ వేధించే తల్లిదండ్రులు సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో స్కూలు నుంచి ఇంటికి వచ్చాక అమ్మమ్మ కనీసం ఆడుకునేందుకు తనకు సమయం ఇవ్వకుండా వేధిస్తుందని ఓ స్కూలు బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
కాగా ఈ బాలుడి తండ్రి కేబుల్ ఆపరేటర్ కావడంతో అతను టీవీ షోలతో స్ఫూర్తి పొందాడు. తన మనవడే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆందోళన చెందిన అమ్మమ్మ, తల్లిదండ్రులు ఆడుకునేందుకు సమయం ఇస్తామని బాలుడికి హామీ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి ఫిర్యాదును తిరిగి తీసుకునేలా చేశారు.