గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (14:06 IST)

ఇంటి ముందు హారన్ కొట్టిన పాపానికి.. ఎంత పని చేశాడో తెలుసా?

ఇంటి ముందు హారన్ కొట్టిన పాపానికి ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఎంత ధైర్యముంటే మా ఇంటి ముందే హారన్ కొడతావని దుర్భాషలాడి.. వాహనదారుడితో పాటు వారి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోబోయిన ఇంట్లోని ఆడవాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాడు. చివరికి అందరితో కాళ్లపై పడి మొక్కించుకుని అవమానించాడు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. దమ్మాయిగూడ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రసాద్‌గౌడ్‌ (35)  సోమవారం అర్ధరాత్రి ఇంటికి కారులో బయలుదేరాడు. ఈ నేపథ్యంలో మార్గమధ్యంలో జంక్షన్ ఉండటంతో హారన్ కొట్టి బయలుదేరాడు. దీంతో అక్కడే ఉన్న కందాడి స్కైలాబ్‌రెడ్డి కోపంతో ఊగిపోయాడు. 
 
కారు నంబర్‌ను గుర్తుంచుకుని ఎనిమిది  అనుచరులతో అర్థరాత్రి ప్రసాద్ గౌడ్ ఇంటిపై దాడికి దిగాడు. వెళ్తూ వెళ్తూ కారు అద్దాలను కూడా ధ్వంసం చేసి పారిపోయాడు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.