మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (19:16 IST)

లాక్ డౌన్‌ పాస్‌‌ను అలా వాడుకున్నాడు.. వేరొక మహిళతో?

లాక్ డౌన్‌ పాస్‌తో ఓ ఉద్యోగి వేరొక మహిళ అక్రమసంబంధాన్ని కొనసాగించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లి చెందిన వ్యక్తి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 
 
లాక్ డౌన్ సమయంలో ఫార్మా స్యూటికల్ కంపెనీలకు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వటంతో వెహికల్ పాస్ తీసుకుని విధులకు హాజరవుతున్నాడు. ఉదయం ఇంటినుంచి బయలు దేరిన రమేష్ ఆఫీసుకు వెళ్తున్నాడు. రాత్రికి ఆఫీసు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లక మూడు రోజులకోసారి ఇంటికి వెళుతున్నాడు.
 
భర్త రోజు ఇంటికి రాకపోయే సరికి కంగారు పడిన భార్య... రోజు ఇంటికి రావట్లేదు ఏంటని అమాయకంగా భర్తను ప్రశ్నించింది. పాస్ ఉన్నప్పటికి కొందరు పోలీసులు రోడ్డుపైకి రావటానికి అనుమతించటం లేదని అబద్ధం చెప్పాడు. వెహికల్ తీసుకుని సీజ్ చేస్తామన్నారని పోలీసులపై ఆరోపణలు చేశాడు. అప్పటికి ఉరుకున్న అతని భార్య రెండు రోజుల తర్వాత భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చి తెలిసిన వారి ద్వారా భర్త గురించి ఆరా తీసింది. చివరికి విషయం తెలుసుకుని షాక్ తింది. 
 
తన భర్త అదే ప్రాంతంలో ఉన్న మరోక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసి ఖంగుతింది. అలా ఓ రోజు ఇంటికి వచ్చిన భర్తను నిలదీసింది. సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇలాంటి వ్యవహారం ఆందోళన కలిగిస్తోందని ఆమె పోలీసుల ముందు తన బాధను చెప్పుకుంది. దీంతో పోలీసులు రమేష్ కు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు.