శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (12:30 IST)

హైదరాబాద్‌లో తప్పతాగి నానాయాగీ చేసిన యువతి..

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో అధికమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో మందు కొట్టి.. ఖరీదైన బెంజ్‌ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ యువతి, తనను అడ్డుకున్న పోలీసుల

హైదరాబాదులో మందుబాబులు రెచ్చిపోతున్నారు. డ్రంకన్ డ్రైవ్ కేసులు హైదరాబాద్‌లో అధికమవుతున్నాయి. జూబ్లీహిల్స్‌లో మందు కొట్టి.. ఖరీదైన బెంజ్‌ కారును డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఓ యువతి, తనను అడ్డుకున్న పోలీసులపై చిందుకు తొక్కింది. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలకు సహకరించకుండా వారి సహనానికి పరీక్షగా నిలిచింది. 
 
గత రాత్రి 105 మంది మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబట్టారు. వీరిలో ఓ యువతి తప్పతాగి హంగామా చేసింది. దీంతో మహిళా కానిస్టేబుళ్లు రంగ ప్రవేశం చేసి ఆమెకు పరీక్ష చేయాల్సి వచ్చింది. సదరు యువతి మీడియా కెమెరాలను నాశనం చేసేందుకు చూసింది. తనను వీడియో తీస్తున్న కెమెరామెన్ వెంటపడింది. 
 
సికింద్రాబాద్‌కు చెందిన వ్యాపారి రాహుల్, అతని గర్ల్ ఫ్రెండ్ కూడా పోలీసుల మందు నానాయాగీ చేశారు. వివిధ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల తర్వాత 42 కార్లు, 61 ద్విచక్ర వాహనాలతో పాటు ఆటోలనూ సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. తామెంత విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా.. మందుబాబు మెట్టుదిగడం లేదని పోలీసు అధికారులు చెప్పారు.