శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2019 (13:40 IST)

అతను బ్లాక్ మెయిల్ చేశాడు.. అందుకే అమ్మను చంపేందుకు ఓకే చెప్పా : కీర్తి

తన ప్రియుడుతో కలిసి కన్నతల్లిని చేసిన కీర్తి ఇపుడు బోరున విలపిస్తోంది. తనను చూసేందుకు వచ్చిన కన్నతండ్రి, ఇతర బంధువులను చూసి బోరున విలపిస్తోంది. పైగా, తనను జైలు నుంచి విడిపించేలా చర్యలు తీసుకోవాలంటూ తండ్రివద్ద ప్రాధేయపడింది. అంతేకాకుండా, తాను ఇకపై బుద్ధిగా ఉంటూ చదువుకుంటానని హామీ ఇచ్చింది. కుమార్తె మాటలు విన్న ఆ కన్నతండ్రి కూడా బోరున విలపించాడు. 
 
హైదరాబాద్‌లో కీర్తి అనే యువతి చెడు తిరుగుళ్లు తిరగడాన్ని సహించలేని తల్లి.. మందలించింది. దీంతో ఆగ్రహించిన ఆ యువతి తన రెండో ప్రియుడుతో కలిసి తల్లిని చంపేసి, మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసింది. ఈ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితురాలు చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉంది. 
 
ఆమెను చూసేందుకు కీర్తి తండ్రి, అమ్మమ్మ, చిన్నమ్మలు జైలుకు వచ్చారు. జైల్లో ఉన్న తనను చూసేందుకు తొలిసారిగా వచ్చిన తండ్రిని చూసి క్షమించమంటూ కీర్తి భోరున విలపిస్తూ ప్రాధేయపడింది. పైగా, తీవ్ర భావోద్వేగానికి గురైన ఆయన కూడా రోదిస్తూనే ఆమెను ఓదార్చినట్లు తెలిసింది. శశికుమార్‌ (రెండో ప్రియుడు) బ్లాక్‌మెయిల్‌ చేయడం.. బెదిరించడంతోనే తల్లి హత్యకు సహకరించినట్లుగా తండ్రితో కీర్తి చెప్పినట్లు సమాచారం. 
 
తనను బెయిల్‌పై తీసుకెళ్తే బుద్ధిగా చదువుకుంటానని, ఏలా చెబితే అలా నడుచుకుంటానని తండ్రిని వేడుకున్నట్లు తెలిసింది. కాగా కీర్తి రిమాండ్‌ గడువు ముగియడంతో పోలీసులు గురువారం హయత్‌నగర్‌ కోర్టులో హాజరుపరిచారు. ఆమె రిమాండ్‌ను మరో 14 రోజుల పాటు పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.