శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:01 IST)

ఫ్రెండ్స్‌తో పందెం... ఇంజినీరింగ్ యువతి నగ్న వీడియో...

ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన ఓ విద్యార్థిని తన స్నేహితురాళ్ళతో పందెం కట్టి వంటిపై నూలుపోగు లేకుండా ఓ సినిమా పాటకు డబ్ స్మాష్ చేస్తూ నాట్యం చేసింది. దీన్ని తన మొబైల్ ఫోనులో చిత్రీకరించుకుంది.

ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన ఓ విద్యార్థిని తన స్నేహితురాళ్ళతో పందెం కట్టి వంటిపై నూలుపోగు లేకుండా ఓ సినిమా పాటకు డబ్ స్మాష్ చేస్తూ నాట్యం చేసింది. దీన్ని తన మొబైల్ ఫోనులో చిత్రీకరించుకుంది. దీన్ని తన స్నేహితురాళ్ళకు చూపించి... రూ.10 వేల నగదు గెలుచుకుంది. అయితే,ఆ ఆనందం ఆమెకు ఎంతోకాలం నిలవలేదు. ఈ నగ్న వీడియోను చేజిక్కించుకున్న ఓ యువకుడు ఆ యువతిని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. రూ.2 లక్షలు ఇవ్వకుంటే నీ న్యూడ్ వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.
 
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... నగరానికి చెందిన ఓ యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తన స్నేహితురాళ్లతో రూ.10 వేలు పందెం కట్టి, నగ్నంగా ఓ సినిమా పాటకు డబ్ స్మాష్ చేస్తూ, తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించింది. దాన్ని ఎవరికీ పంపించని ఆమె, స్నేహితురాళ్లకు మాత్రం చూపించి డబ్బు గెలుచుకున్నానని సంబరపడిపోయింది. ఇది జరిగి చాలా రోజులైంది. 
 
అయితే, ఆమె సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఒకరోజు బయటకు వెళ్లిన వేళ, ఆమె తన సెల్ ఫోన్ పోగొట్టుకుంది. ఆపై రెండు రోజుల తర్వాత, ఓ యువకుడు ఫోన్ చేసి, 'నీ న్యూడ్ వీడియోలు నాదగ్గర ఉన్నాయి. రూ.2 లక్షలు ఇవ్వకుంటే వాటిని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తా' అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని యువతి షీ టీమ్స్‌ను ఆశ్రయించి, తన గోడును వెళ్లబోసుకుంది. 
 
ఆపై రంగంలోకి దిగిన పోలీసులు, ఆ యువకుడిని గుర్తించి, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఆ అమ్మాయిని హెచ్చరించి పంపారు. అనేక మంది అమ్మాయిలు స్నానాలు చేస్తూ తమ నగ్న వీడియోలు తీసుకుంటున్నారని, వాటిని స్నేహితురాళ్లతో పంచుకుంటున్నారని, ఈ తరహా ఘటనలు ఏ మాత్రం కూడదని పోలీసులు సలహా ఇస్తున్నారు.