మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సందీప్
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (14:52 IST)

సోదరిని ఏడిపిస్తున్నాడనీ... గుండెల్లో పొడిచి చంపేశాడు

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. జూబ్లీహిల్స్‌లో ఓ వ్యక్తిని మరో వ్యక్తి గుండెల్లో కత్తితో పొడిచి చంపేశాడు. తన సోదరిని ఏడిపిస్తున్నాడని నిలదీయడానికి వెళ్లిన వ్యక్తిని నిందితుడు కత్తితో పొడిచేశాడు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... జూబ్లీహిల్స్‌లోని వీడియో గల్లీలో నివసించే డేవిడ్ కొద్దిరోజులుగా అమ్మాయిలను అల్లరిపెడుతున్నాడు. ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసించే పృథ్వీరాజ్ అనే వ్యక్తి సోదరిని కూడా ఏడిపించసాగాడు. ఆదివారం రాత్రి కూడా డేవిడ్ మద్యం తాగి ఆ యువకుడి సోదరిని తల్లిని అల్లరి చేశాడు. 
 
అది తెలిసిన పృథ్వీరాజ్ అతడిని నిలదీయడానికి డేవిడ్ ఇంటికి వెళ్లాడు. అతడితో గొడవపెట్టుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య దాదాపు అరగంట పాటు వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో డేవిడ్ పృథ్వీరాజ్‌ని గుండెల్లో కత్తితో పొడిచాడు. అది చూసిన స్థానికులు తీవ్ర రక్త స్రావం అయిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలో మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.