సోమవారం, 7 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (16:36 IST)

హీరో సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్ కేసులో ఛార్జి షీట్

సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో హీరో సాయి ధ‌ర‌మ్ స‌రిగా స్పందించ‌లేద‌ని, దీనిపై కేసు కొన‌సాగుతోంద‌ని సైబరాబాద్‌ పోలీసులు తెలిపారు. సినీ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ యాక్సిడెంట్ అప్ప‌ట్లో ఎంతటి సెన్సేషన్‌గా మారిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 
 
 
గత సెప్టెంబర్‌ 10న హైదరాబాద్‌లోని ఐకియా స్టోర్‌ వద్ద బైక్‌ స్కిడ్‌ కావడంతో తేజ్‌ ప్రమాదం పాల‌య్యాడు.  సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్‌తేజ్‌ ప్రస్తుతం సినిమాల్లో నటించడానికి మళ్లీ సిద్ధమవుతున్నారు. ఈ త‌రుణంలో తేజ్‌ యాక్సిడెంట్‌ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. సాయి ధరమ్‌తేజ్‌పై ఛార్జ్‌ షీట్‌ దాఖలు చేయనున్నట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ తెలిపారు.
 
 
హైద‌రాబాదులో సోమవారం నిర్వహించిన మీడియాలో సమావేశంలో పాల్గొన్న కమిషనర్‌ స్టీఫెన్‌ రవింద్ర బైక్‌ యాక్సిడెంట్‌ విషయమై పలు కీలక విషయాలను వెల్లడించారు. సాయి ధరమ్‌ తేజ్‌ యాక్సిడెంట్‌ విషయమై కేసు నమోదు చేశామని తెలిపిన కమిషనర్‌, ఆయన కోలుకున్నాక 91 CRPC కింద నోటీసులు ఇచ్చామని తెలిపారు.


నోటీసుల్లో భాగంగా లైసెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికేట్‌, ఆర్సీ, ఇన్సురెన్స్‌ వంటి డ్యాక్యుమెంట్లను సబ్‌మిట్ చేయాలని కోరామన్నారు. అయితే సాయ్‌ ధరమ్‌ తేజ్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు. తేజ్‌ నుంచి స్పందనరాని కారణంగా, అతనిపై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు.