బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 సెప్టెంబరు 2021 (19:25 IST)

హీరో సాయిధరమ్ ఆరోగ్యం ఎలావుంది?

ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు.
 
'సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్‌ అవసరం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతానికి ఐసీయూలోనే అతడికి చికిత్స అందిస్తున్నాం' అని అపోలో ఆస్పత్రి వర్గాలు బులిటెన్‌ విడుదల చేశాయి.
 
శుక్రవారం రాత్రి స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయన తీవ్రగాయాలు అయ్యాయి. నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌ - ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెడికవర్‌లో ప్రాథమికి చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించిన విషయం తెల్సిందే....