శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:40 IST)

భార్యపై అనుమానం : తలపై ఇనుపరాడ్డుతో మోది హత్య చేసిన భర్త

హైదరాబాద్ నగరంలో మరో వివాహిత దారుణ హత్యకు గురైంది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హతమార్చాడు ఆమె తలపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాజేంద్ర నగర్ పరిధిలోని ఎంఎం పహాడ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అమీన్ వృత్తి రీత్యా టైల్స్ పని చేస్తున్నాడు. ఈయనకు నజ్మా అనే మహిళతో తొమ్మిదేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, భార్య ప్రవర్తనపై సయ్యద్ అనుమానం పెంచుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఇటీవల సయ్యద్ పని నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇనుపరాడ్డుతో భార్య తలపై మోదడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నజ్మాను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.