గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (09:34 IST)

మత్తులో 'ఆ' పని చేసిన అమ్మాయి.. వీడియో వైరల్

ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. ఆతిథ్య సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు పీకల వరకు మద్యం సేవించి స్టేడియంకు వచ్చారు. మత్తు పూర్తిగా ఎక్కడంతో మద్యం మత్తులో హల్‌చల్ సృష్టించారు. ముఖ్యంగా ఓ అమ్మాయి అయితే మరింత అసభ్యంగా ప్రవర్తించింది. 
 
మిగిలిన యువతీయువకులు మ్యాచ్‌ జరుగుతుండగానే గ్యాలరీలో నానా హంగామా సృష్టించారు. ఇతర వీక్షకులను గేలి చేస్తూ రచ్చరచ్చ చేశారు. పూర్తిగా మైకంలో ఉన్న ఓ యువతి అసభ్యంగా ప్రవర్తించడంతో ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చశాడు. దీంతో.. పూర్ణిమ, ప్రియ, ప్రశాంతి, శ్రీకాంత్‌రెడ్డి, సురేష్, వేణుగోపాల్‌పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.