సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 10 మే 2017 (20:28 IST)

ఇండియన్ అడ్మిస్ట్రేషన్ సర్వీసెస్(IAS) అంటే తెలియదా పవన్...? ఘాటు కౌంటర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు క్రమంగా వరస కౌంటర్లు పడుతున్నాయి. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది వారిని దక్షిణాది ఆలయాలకు నియమించడంపై తాను వ్యతిరేకం కాకపోయినప్పటికీ ఉత్తరాది ఆలయాలకు దక్షిణాది

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు క్రమంగా వరస కౌంటర్లు పడుతున్నాయి. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది వారిని దక్షిణాది ఆలయాలకు నియమించడంపై తాను వ్యతిరేకం కాకపోయినప్పటికీ ఉత్తరాది ఆలయాలకు దక్షిణాది ఐఏఎస్ అధికారులను ఎందుకు నియమించడం లేదంటూ ప్రశ్నించారు. ఈ నేపధ్యంలో ఇటీవలే మోహన్ బాబు కౌంటరిచ్చారు. 
 
తాజాగా ఐఏఎస్ అధికారుల సంఘం స్పందిస్తూ అన్ని రాష్ట్రాల కోసం ఐఏఎస్ అధికారులు పనిచేస్తారని చెప్పుకొచ్చారు. అనవసరంగా క‌ృత్రిమ అడ్డుగోడలు సృష్టించవద్దంటూ ట్వీట్ చేశారు. ఇండియన్ అడ్మిస్ట్రేషన్ సర్వీసెస్(IAS)కు ఎంపికైన అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేసే హక్కు వుందన్న సంగతి పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.