గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (13:51 IST)

భర్తను ప్రియుడు గట్టిగా పట్టుకుంటే భార్య అతడి కడుపులో పొడిచింది

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడన్న అక్కసుతో ఓ మహిళ కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేయించింది. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి ఈ దారుణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన దంపతులకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. అతడి భార్యకు బీదర్‌ ప్రాంతానికి చెందిన కాంబ్లె యువరాజ్‌(35)తో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
ఈ క్రమంలో గత ఆదివారం దంపతులిద్దరి మధ్యలో ఇదేవిషయంలో గొడవ జరిగింది. గొడవ పెరగడంతో ఆమె ప్రియుడిని ఇంటికి పిలిచింది. మద్యం మత్తులో ఉన్న భర్త చేతులను కాంబ్లే వెనక్కి విరిచి పట్టుకుంటే.. భార్య కత్తితో కడుపులో పొడిచింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు చనిపోయాడు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.