శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (10:09 IST)

అరేబియా సముద్రంలో అల్పపీడనం.. మండే ఎండల్లో వర్షాలు..

మండే ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. తెలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి ప్రజలకు ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో తెలుగు రాష

మండే ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. తెలగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రత నుంచి ప్రజలకు ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
 
అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్రలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని.. మహారాష్ట్ర, కేరళ ప్రాంతాలకు కూడా వర్ష సూచనలున్నాయని తెలిపారు. వేసవి తాపాన్ని ఈ వర్షాలు తగ్గిస్తాయని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. 
 
అరేబియాలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, కేరళ, దక్షిణాది ప్రాంతాల్లో వచ్చే 48 గంటల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీంతో తమిళనాడు, కేరళ దక్షిణ సముద్ర తీర ప్రాంతాలకు చెందిన జాలరులు చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.