గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

వైసీపీ విధానాలతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు

వైసీపీ పాలనలో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందని టీడీపీ పోలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి ఆరోపించారు. జగన్​ సర్కారు వైఫల్యం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని అన్నారు.

పోలవరం, పీపీఏలు వంటి విషయాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని టీడీపీ పోలిట్​బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. అమరావతిలో జరిగిన పోలిట్​బ్యూరో సమావేశం వివరాలు వెల్లడించిన ఆయన... ప్రధానంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై చర్చించినట్లు వివరించారు.

గత ఐదు నెలల్లో రాష్ట్ర ఆదాయం 17 శాతం తగ్గిందని అన్నారు. కియా కార్ల పరిశ్రమను స్థానిక ఎంపీ బెదిరించారని ఆరోపించారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. నీటి పంపకాలపై రాష్ట్రాల మధ్య వివాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఎగువ రాష్ట్రాల ఒక్క టీఎంసీ ఇచ్చేందుకూ ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్​, కేసీఆర్​ స్నేహం వారి వ్యక్తిగతమన్న ఆయన ఏపీ జలాలు తెలంగాణ భూముల్లోకి పంపడంపై పునరాలోచించాలని సూచించారు. పోలవరం, పీపీఏలు ఇలా అన్నింటిలో కేంద్రంతో ఘర్షణ వైఖరి నెలకొందని ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు.