గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (14:43 IST)

ఏపీలో పరీక్ష రాస్తూ మరో విద్యార్థి మృతి.. కెమిస్ట్రీ పరీక్ష రాస్తూ..?

ఏపీలో పరీక్ష రాస్తూ ఇటీవల ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో పరీక్ష రాస్తూ మరో విద్యార్థి కుప్పకూలిపోయి, మృతి చెందాడు. పరీక్ష రాస్తూ విద్యార్థి కుప్పకూలిపోగా అప్రమత్తమైన కళాశాల సిబ్బంది చికిత్స నిమిత్తం విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని కిరణ్మయి కాలేజీలో కార్తీక్‌ అనే విద్యార్థి ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు.
 
బుధవారం కెమిస్ట్రీ పరీక్ష రాస్తూ కార్తీక్ సడన్‌గా కుప్పకూలిపోయి సృహ కోల్పోయాడు. దీంతో వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది.. విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కార్తీక్ స్వగ్రామం సారవకోట మండలం, దాసుపురం గ్రామంగా గుర్తించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.