శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మే 2022 (09:02 IST)

అధిక మార్కులు వేయిస్తానని విద్యార్థిని అక్కడ తాకిన అబ్జర్వర్

victim
డిగ్రీ పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థిని పట్ల అబ్జర్వర్ ఒకరు పరీక్షా హాలులో అసభ్యంగా ప్రవర్తించాడు. అధిక మార్కులు వేయిస్తానని, మాస్ కాపీయింగ్‌కు సహకరిస్తానని ప్రలోభానికి గురిచేసి ఆ విద్యార్థిని వక్షోజాలను తాకాడు. దీంతో ఖంగుతిన్న ఆ విద్యార్థిని పరీక్ష ముగిసిన తర్వాత జరిగిన విషయం కాలేజీ యాజమాన్యానికి, కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్ళింది. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్జర్వర్‌కు దేహశుద్ధి చేశారు. 
 
దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ కామాంధుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా తంబళ్ళపల్లె మండలం కేంద్రంలోని ఓ ప్రైవేటు కాలేజీలో జరిగింది ఈ పరీక్షలకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా పని చేస్తున్న మాధవరెడ్డి అనే వ్యక్తి అబ్జర్వర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం జరిగిన డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్ష సందర్భంగా ఈ ఘటన జరిగింది.