తన అసిస్టెంట్లను దూరం పెట్టిన రాఘవేంద్రరావు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు కరోనా 3వ వేవ్‌లో వున్న ఒమిక్రాన్ వైరస్ సోకింది. దానితో మంగళవారంనాడు ఆయన్ను కలవాలని వచ్చినవారిని కలవనీయకుండా పంపించేశారు. కరోనా విషయంలో చాలా కేర్‌గా వుండే ప్రముఖుల్లో రాఘవేంద్రరావు ఒకరు. ఆయన చాలా డిస్టెన్స్ మెయింటెన్స్ చేస్తుంటారు. అంటే గాలి ద్వారా సోకే వ్యాధి కాబట్టి చాలా జాగత్రగా వుండమని తన యూనిట్ సభ్యులకు తెలియజేశారు.
రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఓ వెబ్ సిరీస్ నడుస్తుంది. కథా చర్చల్లో భాగంగా ఆయన్ను కలవాలని వెళ్ళినవారికే ఈ విషయం తెలిసిందని ఫిలింనగర్ వర్గాలు తెలియజేశాయి. ఓ సీన్ చర్చించే విషయంలో చాలా దూరంగా వుండి వారితో మాట్లాడి పంపించేశారట.
ఇప్పటికే కరోనా రెండోసారి సోకిన ప్రముఖులలో చిరంజీవి కూడా వున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఓమిక్రాన్ రేటు తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించడంతో తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ చేశారు. అదేవిధంగా చిన్న నిర్మాతలకు థియేటర్ల పూర్తి కెపాసిటీతో వుండడంతో వాటిని రిలీజ్ చేసే పనిలో వున్నారు. ఫిబ్రవరి నెలలో పూర్తిగా కరోనా ఇబ్బందులు తొలగుతాయని సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎందుకైనా మంచిదని పలువురు తమ సినిమాలకు రెండు డేట్స్‌ను ఫిక్స్ చేసుకున్నారు.