సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (16:02 IST)

నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రమది- విజయ్ దేవరకొండ

Vijay Devarakonda, Priyamani,Bharat Kamma, Abhimanyu Tadi and ohters
థ్రిల్ల‌ర్ కామెడీ వెబ్ ఒరిజిన‌ల్ ‘భామా కలాపం’ . ప్రముఖ నటి ప్రియమణి ఈ వెబ్ ఒరిజినల్ ద్వారా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఈ వెబ్ ఒరిజిన‌ల్ ఫిబ్ర‌వ‌రి 11న ‘ఆహా’లో ప్రసారమవుతుంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్. ఈ వెబ్ ఒరిజినల్ ట్రైలర్‌ను ‘లైగ‌ర్’ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ సోమవారం విడుదల చేశారు.
 
అనంత‌రం దేవరకొండ మాట్లాడుతూ ‘‘భరత్ కమ్మ తన మొదటి సినిమా డియర్ కామ్రేడ్ సినిమా చేశాం. తనతో సినిమా చేయాలని నేనే కోరుకున్నాను.నా కెరీర్లో నేను మరచిపోలేని చిత్రమది. బాపినీడు, ప్రసాద్ గారికి, డైరెక్టర్ అభికి అభినందనలు. ఇక ప్రియ‌మ‌ణిగారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆమె ఏ లాంగ్వేజ్‌లో చేసిన సూట్ అయిపోతారు. ఇప్పుడు ఆమె డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఆమె చేసిన భామా క‌లాపం ఒరిజినల్ ద్వారా. ఇది ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ అవుతుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది. ఆహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 
 
ప్రియమణి మాట్లాడుతూ ‘‘భామా కలాపం అనేది నా డిజిటల్ బెస్ట్ డెబ్యూ అని చెప్పాలి. అందుకు భరత్ కమ్మగారికి థాంక్స్. భరత్ కమ్మగారికి, అభిమన్యు తాడి మేటిని చాలా ఇబ్బంది పెట్టాను. అందుకు వారికి థాంక్స్‌. మొద‌టి షెడ్యూల్ కోసం ఆరు రోజులు కేటాయించాను. త‌ర్వాత షెడ్యూల్ కోసం నెల‌న్న‌ర పాటు స‌మ‌యం కేటాయించ లేక‌పోయాను. త‌ర్వాత సింపుల్‌గా, స్వీట్‌గా పూర్తి చేసేలా భ‌ర‌త్‌, అభి వ‌ర్క్ చేశారు. అనుప‌మ వంటి క్యారెక్ట‌ర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు నేను ప్లే చేయ‌లేదు. చాలా అమాయక‌మైన గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తాను. ఫిబ్ర‌వ‌రి 11న భామా క‌లాపం ఆహాలో ప్రసారం కానుంది. ఇంత పెద్ద ఎత్తున దీన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్న ఆహా టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 
 
భరత్ కమ్మ మాట్లాడుతూ ‘‘అభి నాతో 8 ఏళ్లుగా రైటింగ డిపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. లాస్ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఈ ఐడియాను నాకు చెప్పాడు. ఇద్ద‌రం క‌లిసి పాయింట్ మీద వ‌ర్క్ చేశాం. ఆహా టీమ్‌, అర‌వింద్‌గారికి ఈ క‌థ చెప్ప‌గానే వారికి బాగా న‌చ్చేసింది. అయితే అనుప‌మ పాత్ర‌లో ఎవ‌రు చేస్తార‌నే దానిపై అప్పుడింకా నిర్ణ‌యించుకోలేదు. ఆ పాత్ర‌లో న‌టించ‌డానికి ఒప్పుకున్న ప్రియ‌మ‌ణిగారికి  థాంక్స్‌. ఎస్‌వీసీసీ మీద దీన్ని ప్రొడ్యూస్ చేసిన బాపినీడుగారు, సుధీర్ గారికి థాంక్స్‌. అభిమ‌న్య తాడి మేటి దీన్ని అనుకున్న దాని కంటే బాగా డైరెక్ట్ చేశాడు. ఎందుకంటే, అర‌వింద్‌గారు చూడ‌గానే అదే విష‌యాన్ని ఫోన్ చేసి చెప్పారు. యంగ్ టీమ్ ఈ సిరీస్ కోసం ప‌నిచేసింది. దీప‌క్‌, జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌, రాబిన్ అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు.