బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (13:12 IST)

జాతీయ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ ఉపకారవేతనాలు-2021-22 విద్యాసంవత్సరానికి గుంటూరుజిల్లాలోని ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల నుంచి ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, మెరిట్‌ కం మీన్స్‌ ఉపకార వేతనాల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మస్తాన్‌ షరీఫ్‌ తెలిపారు.

దరఖాస్తుకు అవసరమైన ఆదాయ, విద్యా ధ్రువపత్రాలు, విద్యార్థి పేరుతో ఉన్న బ్యాంకు పాస్‌ పుస్తకం జిరాక్స్‌ కాపీ జత చేయాలన్నారు.

ఆన్‌లైన్‌ అనంతరం దరఖాస్తు కాపీలను, జత చేసిన వాటిని పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్‌కు అందించాలన్నారు. వాటిని పాఠశాల, కళాశాలకు ఇచ్చిన లాగిన్‌ ద్వారా జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.