గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (11:27 IST)

హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ భార్య ఆత్మహత్య!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమినర్ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అదనపు పోలీసు కమినషర్ పేరు శివప్రసాద్. ఈయన భార్య ఉషారాణి. ఈమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఇన

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అదనపు పోలీసు కమినర్ భార్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆ అదనపు పోలీసు కమినషర్ పేరు శివప్రసాద్. ఈయన భార్య ఉషారాణి. ఈమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఆయన, బేగంపేటలోని పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. 
 
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉషారాణి, తమ నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఉషారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. భార్యను కోల్పోయిన శివప్రసాద్‌ను పోలీసు ఉన్నతాధికారులు ఓదార్చుతున్నారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.