శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: బుధవారం, 8 సెప్టెంబరు 2021 (10:18 IST)

గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోందా? 1906 కాల్ చేయండి

మీ ఇంట్లో గ్యాస్ సిలిండ‌ర్ లీక్ అవుతోందా?  ఈ విష‌యాన్ని మీ గ్యాస్ ఏజెన్సి వారికి చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేదా? గ్యాస్ డెలివ‌రీ బాయ్‌ని పంప‌డానికి తాత్సారం చేస్తున్నారా? అయితే, మీరు ఒక ప‌ని చేయండి. 1906కి కాల్ చేయండి.
 
మీ ఇంట్లో గ్యాస్ పొయ్యికి కొత్త సిలిండ‌ర్ అమర్చడానికి ప్రయత్నించినప్పుడు, గ్యాస్ లీక్ అవుతోందని గమనించారా? అయితే, నాబ్‌ను ఆపివేసి, మీ గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేయండి. కానీ, అది ఆదివారం కావడంతో వారు స్పందించలేదా? వారు సోమవారం దీనికి హాజరు అవుతామ‌ని చెప్పారా? 
 
ఇలాంట‌పుడు మీకు ఎమర్జెన్సీ ఉన్న‌పుడు అత్యవసర నంబర్ 1906 అనే నెంబర్‌కి కాల్ చేయండి. 
మీ స‌మస్యను వారికి వివరించండి. ఒక గంటలోపు ఒక వ్యక్తి వస్తాడని, మీ పనికి హాజరవుతార‌ని చెపుతారు.
దానికి ఎటువంటి ఛార్జీ లేద‌ని, గ్యాస్ ట్యూబ్ చెడిపోతే తప్ప, ఏమీ చెల్లించాల్సిన అవసరం లేద‌ని కూడా చెపుతారు. బాయ్ వ‌చ్చి గ్యాస్ తనిఖీ చేసి సిలిండర్‌కు కొత్త వాషర్ పెడ‌తాడు. ఈ చిన్న పనికి, అతనికి ఎలాంటి పారితోషికాన్ని ఇవ్వ‌న‌వ‌స‌రం లేదు.

ఈ సేవ కేంద్ర ప్రభుత్వం నుండి తక్కువ సమయంలో అందించబడుతుంది. అంతేకాదు, గంట తర్వాత 1906 కాల్ సెంట‌ర్ నుంచి మీకు మళ్లీ ఫోన్ వ‌స్తుంది. పని జరిగిందీ లేనిదీ తనిఖీ చేస్తారు. ద‌టీజ్ 1906.