బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 జూన్ 2021 (10:11 IST)

ఢిల్లీలో గ్యాస్ పేలుడు : 13 మంది తీవ్రగాయాలు

దేశ రాజధాని ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద గ్యాస్ సిలిండర్ పేలింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వెంటనే మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. 
 
గంటల వ్యవధిలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అయితే గ్యాస్ లీకేజీ కారణంగానే ఈ సంఘటన జరిగిందని ఆయన ధృవీకరించారు. 
 
కాగా ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం మాత్రం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది వివరించారు. ఈ ప్రమాదంలో ఇంకా ఆస్తినష్టం ఎంత జరిగిందో తెలియరాలేదన్నారు.